స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజల్లో డిజిటల్ భద్రతపై అవగాహన పొందించేందుకు ‘Stay Alert – Stay Aware – Stay Safe & Secure’ కార్యక్రమానికి ప్రముఖ నటుడు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాలుగేళ్ల క్రితం నేను కూడా ఓ సైబర్ ఫ్రాడ్‌కు గురయ్యాను. నేరుగా బ్యాంకర్ అని చెప్పడంతో నిజమని నమ్మి మోసపోయాను. ఈ అనుభవంతో సైబర్ నేరగాళ్లు ఎంత నమ్మకంగా, పక్కా పథకంతో మోసం చేస్తారో తనకు అర్థమైందని నాగార్జున పేర్కొన్నారు.