అరుణాచల్‌ప్రదేశ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి కొన్ని ప్రాంతాల్లో చైనా చర్యల విషయంలో కేంద్రం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. అరుణాచల్ ప్రదేశ్‌లో పలు కీలక ప్రాంతాల్లో భారత సైన్యం పెట్రోలింగ్ నిర్వహించకుండా చైనా సైన్యం అడ్డుకుంటున్నదంటూ వస్తున్న వార్తలు అత్యంత ఆందోళనకరమని రాహుల్ గాంధీ అన్నారు. దేశ భద్రత కంటే ప్రధాని మోదీ తన వ్యక్తిగత ‘ఫేక్ ఇమేజ్’ను కాపాడుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది దేశానికి అత్యంత ప్రమాదకరమన్నారు.