అంతరిక్ష పరిశోధనల్లో దూసుకెళ్తున్న ISRO.. చంద్రుడిపై కీలక పరిశోధనలు చేస్తున్న సంగతి విషయం తెలిసిందే. అమెరికా కూడా.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై 2032 నాటికి శాశ్వత మానవ స్థావరం ఏర్పాటు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల తల పెట్టిన మూన్ బేస్ మిషన్ లో భాగం కావాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థను నాసా ఆహ్వానించింది. ఇప్పటికే చేసుకున్న ఒప్పందాలను మరింత బలోపేతం చేసుకోవడం, శాస్త్రీయ సమాచారాన్ని పంచుకోవడం, సహకారం, వీటికి సంబంధించిన చర్చలను ముమ్మరం చేసుకునేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.