సీనియర్ నటుడు, రచయిత, దర్శకుడు యల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు నాటకరంగంలో ఓ విశిష్ట అధ్యాయం ముగిసినట్లైంది. ఏకంగా 1500కు పైగా నాటకాల్లో నటించడమే కాకుండా, ఎన్నో నాటకాలకు రచన కూడా చేశారు. ఆయన సినీ రచయితగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ‘శ్రీరాములయ్య’, ‘భద్రాచలం’ చిత్రాలకు కథ అందించారు. జయం మనదేరా మూవీ రైటింగ్ టీంలో కూడా పనిచేశారు.