జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు బ్రేక్ తనిఖీ చేస్తుండగా బస్సు కింద పడి మెకానిక్ సంతోష్ (39) మృతిచెందాడు. విధుల్లో భాగంగా బ్రేక్ సమస్య తలెత్తిన ఓ ఆర్టీసీ బస్సుకు సంతోష్ కుమార్ మంగళవారం ఉదయం మరమ్మతులు చేశాడు. రిపేర్ అనంతరం బస్సు కింద నుంచి సంతోష్ బయటకు వచ్చేలోపే డ్రైవర్ బస్సును స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాడు. దీంతో బస్సు చక్రాల కింద నలిగి సంతోష్ అక్కడికక్కడే మృతిచెందాడు.