జార్ఖండ్ లో పరీక్షల అక్రమాలపై కొన్ని రోజులుగా తీవ్ర నిరసనలు చేపడుతున్న విద్యార్ధులు ఇవాళ అసెంబ్లీ మార్చ్ కు పిలుపునిచ్చారు. విద్యార్ధులకు మద్దతుగా నిరాహారదీక్ష చేస్తున్న దేవేంద్ర నాథ్ మహతోను కూడా తమతో పాటు తీసుకుని అసెంబ్లీకి విద్యార్ధులు బయలుదేరారు. విద్యార్ధుల అసెంబ్లీ మార్చ్ పిలుపుతో పోలీసులు అప్రమత్తమై రాంచీలో ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసినా ఆందోళనకారులు వాటిని బద్దలు కొట్టుకుని ముందుకు సాగుతున్నారు. దీంతో వీరిని అడ్డుకునేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగిస్తున్నారు. దీంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.