DSC -2025లో చేపట్టిన నియామకాల్లో అక్రమాలు జరిగాయని, స్పోర్ట్స్ కోటాను రూల్స్‌కు పాటించలేదని ఆరోపిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శాంతియుత ర్యాలీలు నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు నిరసనలతో హోరెత్తించింది. పోలీసులు తీసుకుంటున్న చర్యను ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యంగా నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.గుడివాడలో నాని ఆధ్వర్యంలో జరగాల్సిన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఆయన్ని హౌస్ అరెస్టు చేశారు.