జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదంం జరిగింది. జమ్ములో సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ ముందు మినీ బస్సు బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో 29 మంది విద్యార్థులు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బాగ్ ఎ బహు ప్రాంతంలో విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్ని అనంతరం ముబారక్ మండీకి
వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది. ఈ ఘటనపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.