పెట్రోల్‌లో ఇథనాల్ కలపడంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న వివాదంపై మధ్యప్రదేశ్‌లోని రీవా నియోజకవర్గ బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ విధానాన్ని గట్టిగా సమర్థిస్తూ.. దీనిని వ్యతిరేకిస్తున్న వారిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అసలు స్వచ్ఛమైన పెట్రోల్ లభించనప్పుడు, విమర్శకులు డిమాండ్ చేస్తున్నట్లు “స్వచ్ఛమైన పెట్రోల్ ఏమైనా మీ బాబు ఇంటి నుంచి వస్తుందా?” అని ప్రశ్నిస్తూ వ్యాఖ్యానించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.