బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) దళాలు రెండు రోజుల క్రితం ఒక బంగ్లాదేశీ చొరబాటుదారుడిని అరెస్టు చేసిన ఘటనకు ప్రతికారంగా.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన టీ తోట రైతును బంగ్లాదేశీయులు కిడ్నాప్ చేశారు దీపన్కర్ గోప్ తన సొంత టీ తోటలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా.. సుమారు 20 మందితో కూడిన బంగ్లాదేశీయుల గుంపు ఒక్కసారిగా ఆయనపైకి దూసుకొచ్చి బందీగా పట్టుకుంది. ఆపై అతడిని బలవంతంగా సరిహద్దు దాటించి బంగ్లాదేశ్‌లోని పంచగఢ్ జిల్లాలోకి తీసుకెళ్లి.. అక్కడి బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) బలగాలకు అప్పగించారు.