అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టాయి. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీకి పిలుపునిచ్చారు. వైసీపీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ సర్కిల్ వరకూ నిరసన ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. <span;>మరోవైపు తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో జేసీ నివాసం వద్దకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. అయితే తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.