అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న అల్లుడు మైఖెల్ బౌలోస్ భారత పర్యటనలో ఉన్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా శనివారం ఆయన కేరళలోని కొచ్చికి చేరుకున్నారు. ఆయనతో పాటు బారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. మైఖెల్ బౌలోస్ అలప్పుళలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది మేలో కూడా మైఖెల్ తన సతీమణి, ట్రంప్ కుమార్తె టిఫానీతో కలిసి భారత్‌లో పర్యటించారు.