మెడికో ప్రియాంక చికిత్సలో చివరి ప్రయత్నంగా నేడు ఆప్నియా పరీక్ష చేయనున్నారు వైద్యులు. కోమాలో ఉన్న ప్రియాంక మెదడు పూర్తిగా పనిచేయడం ఆగిపోయిందా.. లేదా అని నిర్ధారించడానికి డాక్టర్లు కీలకమైన పరీక్ష చేయనున్నారు. ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయిందా.. లేదా అనేది అప్నియా పరీక్షతో తెలుసుకోనున్నారు. ఆప్నియా పరీక్ష అనంతరం చివరి రిజల్ట్‌ను
విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేయనున్నారు. అంతేకాకుండా, ప్రియాంక ఆర్గాన్ డొనేషన్ చేసే విషయంపై తల్లిదండ్రులకు ఇప్పటికే పలు మార్లు కిమ్స్ వైద్యులు కౌన్సిలింగ్ ఇచ్చారు.