సింగరేణి కొల్లరీస్ కంపెనీ లిమిటెడ్ చరిత్రలో మరో మైలురాయిని నమోదు చేసుకుంది. ఒడిశాలో నైనీ బొగ్గు బ్లాక్ నుంచి బయలుదేరిన తొలి బొగ్గు రైల్వే రేక్ మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (STPP) కి విజయవంతంగా చేరుకుంది. వీటిలో సుమారు 4 వేలు టన్నుల అత్యుత్తమ జీ-10 గ్రేడ్ బొగ్గు ఉంది. నైనీ బొగ్గు సరఫరాతో STPP ఇందన భద్రత పెరగడమే కాకుండా, రాష్ట్ర విద్యుత్ రంగం మరింత బలపడనుంది.