కృష్ణా జిల్లాలోని కానూరులో NEET కోసం లాంగ్‌టర్మ్ శిక్షణ పొందుతున్న 19 ఏళ్ల విద్యార్థిని వైష్ణవి హాస్టల్ గదిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. హైదరాబాద్‌లోని బేగంపేటకు చెందిన వైష్ణవి, NEET సాధించాలనే లక్ష్యంతో మూడు వారాల క్రితమే కానూరులోని ‘శ్రీ భారతి ఇన్స్టిట్యూట్’లో లాంగ్‌టర్మ్ కోచింగ్ కోసం చేరింది. హాస్టల్లో ఉంటూ శిక్షణ పొందుతున్న ఆమె.. ఇంటికి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం ఇబ్బందిగా ఉందంటూ ఇటీవల తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది.ఆమెకు ధైర్యం చెప్పి, భవిష్యత్తు కోసం సర్దుకుపోవాలని నచ్చజెప్పారు.