రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధాని అమరావతి నిర్మాణంలో వేగం, పారిశ్రామిక ప్రోత్సాహకాలు తదితర అంశాలు ప్రధాన అజెండాగా ఏపీ మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. దాదాపు 30కిపైగా అజెండా అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలపనున్నారు.
ఏపీ పీపీపీ పాలసీ 2026 ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దిశా బిల్లు 2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు 2024 ఉపసంహరించి మరింత పటిష్ఠ చట్టాలపై చర్చించనుంది.