తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్‌ను ఇండియాలో రిస్ట్రిక్ట్ చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. దీనికి కారణాలు ఏంటో చెప్పాలని ఆయన మెటా సంస్థను డిమాండ్ చేశారు. తన ఎక్స్ అకౌంట్లో ఓ మెసేజ్ పోస్టు చేశారు. ఇండియాలో తన అకౌంట్ అందుబాటులో లేదన్నారు. తన అకౌంట్‌ను నియంత్రించడానికి గత కారణాలను కంపెనీ అధికారులు వెల్లడించలేదన్నారు. ఎలా ఆ రిస్ట్రిక్షన్ తొలగించాలన్న అంశాన్ని కూడా ఆ కంపెనీ చెప్పలేకపోయిందన్నారు.