విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గవర్నమెంట్ ప్రెస్ వద్ద వైసీపీ ధర్నాను అడ్డుకున్నారు MLA బొండా ఉమా. వైసీపీ అనధికారికంగా ధర్నా చేస్తోందంటూ బొండా ఉమా ధ్వజమెత్తారు. ఈ మేరకు వైసీపీ టెంట్లను టీడీపీ వర్గాలు తొలగించేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై మరొకరు కుర్చీలు విసిరి కొట్టుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో దీక్ష చేసే హక్కు లేదా? తమపై దాడులు ఎంత వరకు సబబు, రాష్ట్రంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు వైసీపీ నేత మల్లాది విష్ణు.