ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలల నకిలీ ఎన్ఓసీల (NOC) స్కామ్‌కు సంబంధించి దర్యాప్తులో భాగంగా మరొక దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడింది ఏకంగా 8 కాలేజీలు ‘హైడ్రా’ కమిషనర్ రంగనాథ్ సంతకాలను ఫోర్జరీ పద్ధతిలో మరికొన్ని కాలేజీల యాజమాన్యాలు అగ్నిమాపక శాఖ మాజీ డీజీ నాగిరెడ్డి సంతకాలను సైతం ఫోర్జరీ చేసినట్లు అధికారులు తాజాగా గుర్తించారు. అగ్నిమాపక శాఖలో నాగిరెడ్డి లేనప్పటికీ, ఆయన సంతకాలతో కూడిన ఫైర్ సర్టిఫికెట్లు రావడంపై అనుమానం వచ్చిన అధికారులు వెంటనే దీనిపై అంతర్గత విచారణ చేపట్టారు.