ట్రైనీ ఐపీఎస్ ఎం. ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపుల కేసులో అతడు అరెస్టయిన విషయం తెలిసిందే. మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీకి ఇవ్వాలని ఉప్పరపల్లి కోర్టును పోలీసులు కోరారు. దీంతో రెండ్రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది.