సురక్షిత నగరంగా పేరుపొందిన దుబాయ్‌లోని జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం రాత్రి వరుసగా ఏడు భారీ పేలుళ్లు సంభవించి తీవ్ర కలకలం రేపాయి. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన ఈ పేలుళ్లతో స్థానిక ప్రజలు, వాణిజ్య వర్గాలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.