భారత్లో ప్రతి ఏడాది సగటును సుమారు 1.80 లక్షల మంది రోడ్డు ప్రమాదాలకు బలి అవుతున్నట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు ప్రమాదాలను తగ్గించే అంశంపై చర్యలు తీసుకోవాలని ఎంపీ సుధామూర్తి ప్రశ్న వేశారు. జాతీయ రహదారులపై ప్రమాదాలను తగ్గించేందుకు డ్రైవింగ్ లైసెన్సు ఇచ్చే ప్రక్రియ మరింత పటిష్టం చేయాలని ఆమె సూచన చేశారు. అయితే రోడ్డు ప్రమాదాల అంశంలో మనుషుల ప్రవర్తన చాలా ముఖ్యమని, డ్రైవింగ్ శిక్షణను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి గడ్కరీ తెలిపారు.