హర్మూజ్ ను తెరుస్తారా.. తీవ్ర దాడులను ఎదుర్కొంటారా అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ను మరోసారి హెచ్చరించారు. కొనసాగుతున్న చర్చల నుండి వైదొలిగితే తీవ్ర సైనిక చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. హర్మూజ్ జలసంధిని అతిత్వరలో తిరిగి తెరుస్తామని వివరించారు. ఈసందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ చర్చలు బాగా సాగుతున్నాయన్నారు. హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా, ఇరాన్, ఒమన్ ల మధ్య చర్చలు తుదిదశకు చేరుకున్నాయని బుధవారం నాటికి డీల్ కుదిరే అవకాశం ఉందన్నారు.