గాజులరామారం ప్రాంతంలో సోమవారం రెవెన్యూ అధికారులు చేపట్టిన కూల్చివేతల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపు పేరుతో పారిశ్రామిక షెడ్లు, దుకాణాలు మరియు పలు నిర్మాణాలను అధికారులు JCBలతో కూల్చివేశారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ స్థానికులు, వ్యాపారులు పెద్ద ఎత్తున నిరసనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాము గత 45 నుంచి 50 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని, తమ వద్ద చట్టబద్ధమైన భూ పత్రాలు ఉన్నాయని స్పష్టం చేసినా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని బాధితులు వాపోయారు.