కామన్వెల్ గేమ్స్ లో భారత క్రీడాకారులు అద్భుతంగా రాణించారని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. రికార్డులు సృష్టిస్తూ క్రీడారంగాన్ని కొత్తదిశ వైపు తీసుకెళ్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 39 పథకాలు సాధించడం దేశానికి ఎంతో గర్వకారణమని, ఈ విజయం మన పారా అథ్లెట్ల పట్టుదల, పోరాట పటిమకు నిదర్శనమని పవన్ కొనియాడారు. ప్రతి పతకం వెనుక దేశం కోసం ఆడాలనే బలమైన కోరిక ఉందని, రాత్రింబవళ్లు శ్రమించిన కోచ్ లు, సహాయక సిబ్బంది కృషికి అభినందనలు తెలియజేశారు.