ఉమ్మడి గోదావరి జిల్లాలను గోదావరి గంగమ్మ వణికిస్తుంది. ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద నీరు అంతకంత పెరుగుతూ వస్తుంది. దీంతో ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాను గంగమ్మతల్లి వణికిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో ప్రత్యేక పడవలపై రాకపోకలు కొనసాగుతున్నాయి. లంక గ్రామాల్లో నివాసాలు జల దిగ్బంధంగా మారాయి, పి.గన్నవరం మండలంలో లంక గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. కె.ఏనుగుపల్లి, శివాయిలంక, జొన్నలంక, ఉడిమూడిలంక, చాకలిపాలెం శివారు కనకాయలంక తదితర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.