కామన్వెల్త్ గేమ్స్ 2026 ఘనంగా ముగిశాయి. కాగా భారత జట్టు 39 పతకాలతో (13 స్వర్ణాలు, 17 రజతాలు, తొమ్మిది కాంస్యాలు) నాలుగో స్థానంలో ఉంది. ఇక 2030లో శత వార్షికోత్సవానికి ఆతిథ్యం ఇవ్వనున్న అహ్మదాబాద్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.గ్లాస్గో వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ 2026 లో భారత అథ్లెట్లు సంచలన ప్రదర్శనతో అదరగొట్టారు. మన బాక్సర్లు, వెయిట్‌లిఫ్టర్లు, పారా అథ్లెట్లు అద్భుతాలు సృష్టించారు.