కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా కొరియన్ పాప్ సంస్కృతిలో విస్తృతంగా ప్రాచుర్యం పొందిన కొరియన్ ఫింగర్ హార్ట్ చూపిస్తూ ఫొటోను పంచుకున్న ఆయన, జెన్ జీ యువతకు ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఆయన పోస్ట్‌లో.. “నేను ఇంకా విద్యార్థినే. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నాను. నేటి పాఠం.. ఇది స్నేహితుల దినోత్సవం, ఇది ఒక హార్ట్” అని పేర్కొన్నారు. “అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.. ఎంతో ప్రేమతో” అంటూ తన సందేశాన్ని ముగించారు.