భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభంతో ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్ పోర్ట్ సింహద్వారమని స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధి కేంద్రంగా భోగాపురం మారనుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీ పాలనలో యువతకు ఉద్యోగావకాశాలు పెరగబోతున్నాయని అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకున్నట్టే.. ఏపీ ప్రగతి కోసం భోగాపురం రూపంలో ఉత్తరాంధ్ర ఉత్తర ద్వారం ఇవాళ తెరుచుకోబోతోందని ఆయన వ్యాఖ్యానించారు.