భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీపై కొందరు చేస్తున్న అనుచిత వ్యాఖ్యల పట్ల పవన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానిని ఉద్దేశించి అనరాని మాటలు అంటుంటే వినడానికి తనకు ఎంతో బాధగా అనిపిస్తోందని ఆయన ఆవేదన చెందారు. దేశ శ్రేయస్సు కోసం నిరంతరం కష్టపడే వ్యక్తులకు సమాజంలో మనం ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. సమాజంలో పిల్లలకు, నేటి యువతకు సరైన సంస్కార విలువలు నేర్పడం చాలా ముఖ్యమని పిలుపునిచ్చారు.