అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ షీలూ బల్హరా భార్య 23 ఏళ్ల ముస్కాన్ బల్హరా ఆత్మహత్య చేసుకున్నది. రోహతక్ జిల్లాలోని బాహూ అక్బార్పుర్ గ్రామంలో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది.ముస్కాన్ కుటుంబ సభ్యులు షీలూ ఇంటి ముందు ధర్నా చేశారు. తన కూతుర్ని వేధింపులకు గురి చేసినట్లు ఆరోపించారు. ఫోరెన్సిక్ బృందం ఆ ఇంటిని తనిఖీ చేసింది. ఆధారాలను సేకరించారు. ుటుంబసభ్యుల స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. షీలూ బల్హరను ప్రశ్నిస్తున్నారు.