మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ 2015 నాటి వైద్య ప్రవేశ పరీక్ష (నీట్) పేపర్ లీక్ ఉదంతం తనపై ఎంత తీవ్రమైన మానసిక ప్రభావాన్ని చూపిందో వివరించారు. ఎంతో కష్టపడి ప్రిపేర్ అయిన తర్వాత పరీక్ష రద్దు కావడం, మళ్లీ రాయాల్సి రావడం తన జీవితంలోనే అత్యంత కఠినమైన కాలమని ఆమె తెలిపారు. వైద్య వృత్తిపై మక్కువతో తాను ఎంతో ఇష్టపడే కూచిపూడి నృత్యం, పెయింటింగ్ వంటి వాటిని ఒక సంవత్సర కాలం పాటు పూర్తిగా పక్కన పెట్టానని పేర్కొన్నారు