భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సభా వేదికపైకి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసిద్ధ చేనేత శైలి అయిన పొందూరు ఖద్దరు శాలువాతో ప్రధానిని సత్కరించిన అనంతరం, ఉత్తరాంధ్ర కీర్తికి ప్రతీకగా నిలిచే ప్రతిష్టాత్మక ‘బొబ్బిలి వీణ’ను బహూకరించారు. జిఐ (GI) ట్యాగ్ పొందిన బొబ్బిలి వీణ విశిష్టతను, దాని తయారీలో కళాకారులు చూపే నైపుణ్యాన్ని సీఎం చంద్రబాబు ప్రధానికి వివరించగా, మోదీ ఎంతో ఆసక్తిగా ఆ వివరాలను అడిగి తెలుసుకున్నారు.