భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుతో ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్రలో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ పాదాభివందనం చేస్తున్నానని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చామని.. ప్రజల ఆశీస్సులతో చేస్తున్నామని అన్నారు. ఈ ప్రాంతానికి ఎర్రబస్సు కూడా రాదని కొందరు హేళన చేశారని.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభంతో అవహేళన చేసినవారు అడ్రస్ లేకుండా పోయారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని అన్నారు.