స్వర్ణాంధ్ర అభివృద్ధిలో ఈ రోజు ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఇది చంద్రబాబు విజన్ కు సాక్ష్యమని అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభ సభలో మోడీ ప్రసంగించారు. భారత్ మాతాకీ జై అంటూ తన ప్రసంగం ప్రారంభించిన మోడీ.. అందరికీ నమస్కారం అంటూ తెలుగులో అభివాదం చేశారు. ఈ పవిత్రమైన మాసంలో ఈ పవిత్రమైన భూమికి రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రధాన ఆరాధ్య దైవాలైన సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు తెలియజేశారు.