భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోదీ శనివారం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి నేరుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. 11 గంటల 17 నిమిషాల నుంచి 11 గంటల 25 నిమిషాల మధ్య టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభా వేదికకు ప్రధాని చేరుకుంటారు. పదకొండున్నర నుంచి 12 గంటల 55 నిమిషాల మధ్య విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, బహిరంగసభలో ప్రధాని ప్రసంగం ఉంటాయి.