మహిళా ఎస్సైతో అనుచితంగా ప్రవర్తించిన వైకాపా నేతల పై ఆమదాలవలస పోలీసులు కేసు నమోదు చేశారు. వైకాపా అధ్యక్షుడు జగన్ శ్రీకాకుళం పర్యటనలో బూర్జ ఎస్సై ప్రవల్లికపై ఆమదాలవలస వైకాపా ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్, ఆయన అనుచరులు అనుచితంగా ప్రవర్తించి దౌర్జన్యం చేశారు. ఈ ఘటనలో మొత్తం 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చింతాడ రవికుమార్ ను ఏ1గా పేర్కొన్నారు.