థింసా నృత్యంతో ప్రపంచ రికార్డు
ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా అరుదైన గుర్తింపు లభించింది. మన్యం ప్రాంతాలకు చెందిన సంప్రదాయ థింసా నృత్యం వేలాది మంది గిరిజన బాలికల సమిష్టి ప్రదర్శనతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 13 వేల మంది గిరిజన బాలికలు ఒకేసారి లయబద్ధంగా థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. నిర్ణీత నిబంధనల ప్రకారం జరిగిన ఈ భారీ ప్రదర్శనను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించారు.

