ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డిపై ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంది. ఆయన ఇవాళే (జులై 31) తన పదవీ విరమణ చేయాల్సి ఉండగా, అనూహ్యంగా సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆయనపై వచ్చిన తీవ్రస్థాయి అవినీతి మరియు అధికార దుర్వినియోగ ఆరోపణలపై విజిలెన్స్ మరియు విచారణ కమిటీలు సమర్పించిన నివేదికలను పరిశీలించిన ఏయూ పాలకమండలి అత్యవసరంగా సమావేశమై ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రసాదరెడ్డి ఒక విద్యావేత్త మాదిరిగా కాకుండా రాజకీయ నాయకుడిగా వ్యవహరించారనే విమర్శలు బలంగా వినిపించాయి.