ఇంజనీరింగ్ చదువుతున్న యువతను ‘క్రిమినల్ వేస్ట్’ అని ముఖ్యమంత్రి సంబోధించడం అత్యంత బాధాకరమని, వారిని బహిరంగంగా అవమానించడం సరైన పద్ధతి కాదని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో విద్యార్థులు తమకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారనే కక్షతోనే సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. విద్యార్థుల హక్కుల సాధన పోరాటాలను అణచివేసే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం ఈ రకమైన ధోరణిని అవలంబిస్తోందని ఆయన విమర్శించారు.