నందమూరి బాలకృష్ణ కూతురు తేజస్విని త్వరలోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి తెరంగేట్రం చేయబోతున్నారనే వార్త నెట్టింటి తీవ్రదుమారం రేపుతోంది. టాలీవుడ్‌కు పరిచయం అయ్యేందుకు తేజస్విని ఓ పవర్‌ఫుల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీని ఎంచుకున్నట్లు సమాచారం. నిజానికి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ముందుగా హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తారని అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కానీ ఊహించని విధంగా మోక్షజ్ఞ కంటే ముందే తేజస్విని వెండితెరకు పరిచయం కాబోతుందనే వార్త రావడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.