BRS సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో మొదటి నుంచి తనతో కలిసి నడిచిన ఒక ఆప్తమిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోవడం తనకు వ్యక్తిగతంగా ఎంతో తీరని లోటని కేసీఆర్ అత్యంత ఆవేదనతో పేర్కొన్నారు. నీతి, నిజాయతీలకు నిలువుటద్దంగా నిలిచి ప్రజల ఆదరాభిమానాలను పొందిన ఆయన సేవలు చిరస్మరణీయమని గుర్తుచేసుకున్నారు.

