ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకరమైన చిత్రాలు షేర్ చేసిన ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తీవ్రంగా స్పందించారు.ఈ వివాదంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌తో పాటు ఆయా ఖాతాల నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి,మీడియా ఇన్ఛార్జ్ ఎన్.వి సుభాష్ తెలిపారు.

