ఇటీవల కురుస్తున్న వర్షాలతో పాటు, ఎగువ నుండి వస్తున్న వరదల కారణంగా గోదావరి నది ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది.
ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నది వరద పెరగడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ప్రస్తుతానికి 16.55 మీటర్లకు వరద నీరు చేరడంతో అధికారులు, చుట్టు పక్క గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.కాగా తూర్పు గోదావరి, పోలవరం, అంబేద్కర్ కోనసీమ జిల్లాల యంత్రాంగం వరద పరిస్థితుల నేపధ్యంలో అప్రమత్తం అయ్యింది.