గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కి సర్జరీ విజయవంతం కావడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గడిచిన కొన్ని రోజులుగా ఆయన్ని వేధిస్తున్న కుడి చేతి మణికట్టు సమస్యకు కోయంబత్తూరులోని ప్రఖ్యాత గంగా హాస్పిటల్ వైద్యులు శస్త్రచికిత్సను సోమవారం విజయవంతంగా పూర్తి చేశారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి గారికి క్లిష్టమైన వెన్నెముక ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్,అమెరికాలోని ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అలెహాండ్రో బాడియా ఈ సర్జరీకి నేతృత్వం వహించారు.