ముద్రగడ కారణంగానే 2019 లో పార్టీ ఓడిపోయిందనే బోండా ఉమా వ్యాఖ్యల పైన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాను వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదని… జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు హాజరయ్యనని బోండా ఉమా చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. వైసీపీ నేత జక్కంపూడి రాజా గోదావరి లో నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధ వచ్చిన విషయాన్ని బోండా ఉమా సన్నిహితులు గుర్తు చేస్తున్నారు.