చట్టసభలకు పోటీ చేసే వయసును 21 ఏళ్లకు తగ్గించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. నీట్ పశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాహుల్ ప్రధాని అయితే..
చట్ట సభలకు పోటీ చేసే వయసు 21 ఏళ్లకు తగ్గుతుందన్నారు. దేశంలో 30శాతం ఉన్న యువత చట్టసభలకు వెళ్లాలని ఆకాంక్షించారు.