కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై పర్యావరణవేత్త, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ సతీమణి గీతాంజలి అంగ్మో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు చేస్తున్న ఈ ఉద్యమాన్ని రాజకీయ నేతలు వాడుకోవడంపై ఆమె విమర్శలు వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని నివాసం ఎదుట దీక్ష చేపట్టడం సరికాదన్నారు. మోదీ నివాసం వద్ద రాజకీయ నేతలు చేపట్టిన దీక్ష నిజాయితీలేనిదని, కృత్రిమమైనదని ఆమె విమర్శించారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన దీక్షలో పాల్గొనాలని కోరారు.