సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు శనివారం తెల్లవారుజామున బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ పరిణామంపై ఆయన భార్య
గీతాంజలి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గత 20 రోజులుగా ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్న వైద్యుల బోర్డు అంగీకారం లేకుండా వాంగ్చుక్కు నోటి ద్వారా గానీ, ఐవీ (సిరల) ద్వారా గానీ ఎలాంటి మెడిసిన్ ఇవ్వకూడదని ఆమె ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వైద్యులను కోరారు. తమ కుటుంబ సమ్మతి లేకుండా ఎలాంటి వైద్యపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని ఆమె స్పష్టం చేశారు.

