ఉప ముఖ్యమంత్రి పవన్ కు భుజం సర్జరీ చేసిన వైద్యుడి గురించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చ సాగుతోంది.ఈ ఆపరేషన్‌ను ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ మరియు స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్షా పార్దివాలా నేతృత్వంలోని వైద్య బృందం నిర్వహించింది. భుజం, మోకాలు, లిగమెంట్ గాయాలకు అత్యాధునిక శస్త్రచికిత్సలు చేయడంలో డాక్టర్ దిన్షా పార్దివాలా కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. అమెరికాలోని హాస్పిటల్ ఫర్ స్పెషల్ సర్జరీ (న్యూయార్క్), అమెరికన్ స్పోర్ట్స్ మెడిసిన్ ఇన్‌స్టిట్యూట్ (అలబామా) లో ప్రత్యేక శిక్షణ పొందారు.